XtGem Forum catalog
Teluguworld.wap.sh






1000 Abaddalu


విడుదల తేదీ : 15 ఆగష్టు 2013
TeluguWorld.wap.sh : 2.75/5
దర్శకుడు : తేజ
నిర్మాత : పి. సునీత, ఎన్. నీతా రమ్య
సంగీతం : రమణ గోగుల
నటీనటులు : సాయిరాం శంకర్, ఎస్తర్, నాగబాబు..

గతంలో వరుసగా విజయాలు అందుకున్న విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ గత కొద్ది సంవత్సరాలుగా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నాడు. అలాంటి తేజ ఈ సారి అబద్దం అనే కాన్సెప్ట్ ని తీసుకొని ’1000 అబద్దాలు’ అని తీసిన సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రామ్ శంకర్ – ఎస్తర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో కనిపించాడు. తేజ చెప్పిన ’1000 అబద్దాలు’ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల్ని ఎంతవరకూ ఆకట్టుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

కథ :
సత్య(సాయిరాం శంకర్) ఒక అడ్వర్టైజింగ్ కంపెనీకి ఓనర్. సత్య హీరోయిన్ సత్య(ఎస్తర్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే హీరోయిన్ సత్యకి నిశ్చితార్ధం అయిపోయి ఉంటుంది. దాంతో ఎలాగైనా సత్యని పెళ్లి చేసుకోవాలని తన ఫ్రెండ్స్ సహాయంతో అబద్దాలు క్రియేట్ చేసి చివరికి పెళ్లి చేసుకుంటాడు. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో హీరోయిన్ సత్యకి సత్య ఆడిన అబద్దాల గురించి తెలిసిపోతుంది. దాంతో వారిద్దరి మధ్య గొడవలు రావడంతో హీరోయిన్ సత్య హీరో సత్యని వదిలివెళ్లి పోతుంది. మళ్ళీ సత్యని తన లైఫ్ లోకి రాబట్టుకోవడానికి సత్య మళ్ళీ అబద్దాలు చెప్పాడా? లేక తన నిజమైన ప్రేమతోనే హీరోయిన్ సత్య మనసుని గెలుచుకున్నాడా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి నాగబాబు మేజర్ హైలైట్ గా నిలిచాడు. నాగబాబు టవర్ స్టార్ పాత్రలో హీరోయిన్ ఎస్తర్ ని ప్రేమించే లవర్ బాయ్ పాత్రలో కనిపించాడు. సినిమాలో నాగబాబుకి పెద్ద పాత్ర లేకపోయినా ఆయన తెరపై కనిపించినప్పుడల్లా ఆడియన్స్ ని బాగా నవ్వించారు. నాగబాబు కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే తేజ కూడా ఆయన పాత్రని బాగా తీర్చిదిద్దాడు.
సాయిరాం శంకర్ నటన పాత్రకి తగ్గట్టు ఉంది. కామెడీ బాగా చేసాడు ముఖ్యంగా సెకండాఫ్ లో బాగా చేసాడు. అలాగే హీరోయిన్ ని పడేయటం కోసం అబద్దాలు చెప్పే కొన్ని సీన్స్ బాగా చేసాడు.

మైనస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్ తప్పితే మిగతా సినిమా అంతా రొటీన్ గా ఉంది. క్లైమాక్స్ బ్లాక్ లో అనవసరమైన సీన్స్ ని పెట్టి సాగదీయడం వల్ల చాలా స్లోగా ఉంది. సినిమా నిడివిని తగ్గించడం కోసం సినిమాని చాలా వరకూ కట్ చేసెయ్యొచ్చు. సెకండాఫ్ లో లాజిక్ అనేదాని తావే లేకుండా తీసారు. సెకండాఫ్ లో వచ్చే రెండు పాటల టైమింగ్ అస్సలు బాలేదు డానివల్ల సినిమా ఫ్లో దెబ్బతింది. ఫ్యామిలీ డ్రామా సీన్స్ అంత నాచురల్ గా లేవు. హీరోయిన్ పాత్ర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, అలాగే హీరోయిన్ కూడా నటన పరంగా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఎస్తర్ సినిమాలో పాత్రకి అంత పర్ఫెక్ట్ గా సరిపోలేదు.

సాంకేతిక విభాగం :
తేజ తన ప్రతి సినిమాలోనూ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకుంటాడు. అన్ని సినిమాల్లానే ’1000 అబద్దాలు’లో కూడా మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల్లో చాలా బాగుంది. నాగబాబు కోసం రాసిన డైలాగ్స్ చాలా నవ్విస్తాయి. తేజ దర్శకత్వం పరవాలేధనిపించేలా ఉంది.

తీర్పు :

తేజ ఎప్పుడూ కాస్త డిఫరెంట్ సినిమాలే చేస్తానని చెబుతూ ఉంటాడు, కానీ చివరికి కాస్త రొటీన్ సినిమాలు చేస్తుంటాడు. 1000 అబద్దాలు సినిమాని నాగబాబు కోసం చూడొచ్చు. అంతకు మించి ఈ సినిమాలో చూడటానికి ఏమీ లేదు.

TeluguWorld.wap.sh:-2.75/5




Users Online